3, డిసెంబర్ 2010, శుక్రవారం
జగన్‌ను కలిసిన ప్రముఖులు
హైదరాబాద్: పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యేలు అమర్నాథ్రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కమలమ్మ, శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి, పీఆర్పీ మాజీ నేత హరిరామ జోగయ్య, సినీ నటుడు విజయ్‌చందర్ తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌చందర్ మీడియాతో మాట్లాడుతూ జగన్ కొత్త పార్టీ గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సీఎం చెప్పాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తన కూతురి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్‌ను కలిసినట్లు చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి