హైదరాబాద్: రాష్టప్రతి ప్రతిభా పాటిల్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. వాయుసేన విమానంలో ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్టప్రతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారు...
ఆమె నగరంలోని బొల్లారంలోని రాష్టప్రతి విడిదిలో బసచేస్తారు. వాస్తవానికి రాష్టప్రతి వచ్చేనెల ఏడో తేదీవరకూ ఇక్కడ శీతాకాల విడిది చేయాల్సి ఉన్నా.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ విడిదిని డిసెంబర్ 31 వరకే పరిమితం చేశారు. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం రాష్టప్రతి గోవా బయల్దేరి వెళ్తారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి