అలహాబాద్: పన్నెండేళ్ల ఆ పసివాడు ఓ వార పత్రికకు సంపాదకుడు. పేరు ఉత్కర్ష్ త్రిపాఠీ. ఊరు అలహాబాద్. ఏడాదిగా ఉత్కర్ష్ 'జాగృతి' అనే చేతివ్రాత పత్రికను నడుపుతున్నాడు. వారానికోసారి ఈ పత్రికను ప్రచురిస్తాడు. వార్తాసేకరణ నుంచి కథనాలను సిద్ధం చేయడం..ప్రచురణ...చివరకు హాకర్ పనికూడా
తనే స్వయంగా చేస్తాడు. పాఠకులకు పత్రికను పూర్తి ఉచితంగా అందిస్తాడు. పర్యావరణం..భ్రూణహత్యలు... తదితర సందేశాత్మక అంశాలతో... పిల్లల్లో అవగాహన పెంచేందుకు ఈ పత్రికను నడుపుతున్నట్లు ఉత్కర్ష్ చెబుతున్నాడు. ఎంచుకున్న అంశానికి చక్కగా వార్తరూపం తెస్తాడు. ఎడిటింగ్, ప్రూఫ్‌రీడింగ్ అన్నీతనే చేసుకుంటాడు. తర్వాత పేజీని తయారుచేసి...తమ ఇంటి దగ్గరే ఉన్న ఒక దుకాణంలో దాని ఫొటోకాపీలు తీసుకుని...పేపర్‌బాయ్ అవతారం ఎత్తుతాడు. అందరికీ పంచి పెడతాడు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి