విశాఖపట్నం: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్ర యూనివర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఏయూ వీసీ బి.సత్యన్నారాయణ తెలిపారు. యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ల వారీగా పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను
ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో స్థానిక పరిశ్రమలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మూడేళ్లకొకసారి నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి