కేప్‌టౌన్, జనవరి 4(న్యూస్ నెట్): భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. 2 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. సచిన్ టెండూల్కర్ 146 పరుగులకు అవుటయ్యాడు. ఆ తరువాత మిగతా వికెట్లు త్వరగా కోల్పోయింది.
హర్భజన్ 40, జహీర్ కాన్ 23, ఇషాంత్ శర్మ 1 పరుగులకు అవుటయ్యారు. శ్రీశాంత్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ నాలుగు వికెట్లను స్టెయిన్, మార్కెల్ పంచుకున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి