న్యూఢిల్లీ: కాంతులీనే ఉల్కాపాతం సోమవారం ఆకాశంలో కనువిందు చేయనుంది. కొత్త సంవత్సరాన వెలుగులు విరజిమ్మనుంది. ఒక స్థానం నుంచి అనేక ఉల్కలను వెదజల్లే 'క్వాడ్రాంటిడ్స్' ఉల్కాపాతం రాత్రి సమయంలో కనిపించనుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆర్సీ కపూర్ ఆదివారమిక్కడ తెలిపారు.
క్వాడ్రాంటిడ్స్.. గంటకు 40 చొప్పున ఉల్కలను వెదజల్లనుందని చెప్పారు. ఈ ఉల్కలు సెకనుకు 43 కి.మీ. వేగంతో దూసుకువెళతాయన్నారు. క్వాడ్రాంటిడ్స్ను 2003లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన పీటర్ జెన్నిస్కెన్స్ తొలిసారిగా గుర్తించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి