న్యూఢిల్లీ: నక్సల్స్‌పై పోరు సాగిస్తున్న కోబ్రా దళానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరాయి. ప్రస్తుతం సైన్యంలోని ప్రత్యేక దళాలు మాత్రమే వినియోగిస్తున్న టేవర్ ఎక్స్95 సబ్ మెషీన్ గన్లు నక్సల్స్ వ్యతిరేక దళానికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో తయారయ్యే ఈ తుపాకులతో నిమిషానికి 1000 రౌండ్లు కాల్చొచ్చు.
వీటిని కోబ్రా సిబ్బందికి అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలుత వీరికి తాత్కాలిక పద్ధతిలో ఏకే47, ఎంపీ5 తుపాకులను అందజేశారు. అత్యాధునిక ఎక్స్95 తుపాకులను ప్రభుత్వం నక్సల్స్‌పై పోరు సాగిస్తున్న సుశిక్షితులైన సిబ్బందికి ఇప్పటికే అందజేసినట్లు సమాచారం. తాము రూపొందించిన ఎక్స్95 తుపాకులు.. ప్రత్యేక దళాలకు భవిష్యత్ తరం ఆయుధాలని ఇజ్రాయెల్ ఆయుధ పరిశ్రమ పేర్కొంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి