Loading...

5, జనవరి 2011, బుధవారం

రెండో రోజూ జగన్ ఓదార్పుయాత్ర

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: జగన్‌మోహన్‌రెడ్డి  ఓదార్పుయాత్ర  జిల్లాలో  రెండో రోజూ కొనసాగింది. యాత్రలో విగ్రహావిష్కరణలు, సభలు షెడ్యూలు సమయానికి జరగడం లేదు. చోడవరం సభ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగున్నర గంటలకు కూడా జగన్ చేరుకోలేకపోయారు.
జగన్ సోమవారం రాత్రి బస చేసిన కె.కోటపాడులోని పట్టాభిరామయ్య అనే ఉపాధ్యాయుని ఇంటి నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఓదార్పుయాత్రకు బయల్దేరారు. ఆ మండలంలోని ఎ.కోడూరు, కొత్తపెంట, వేచలం, లక్కవరం, సింహాద్రిపురం, జుత్తాడ, గజపతినగరం గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సాయంత్రం చోడవరం మండలం లక్ష్మీపురంలోని రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి బయల్దేరి గాంధీగ్రాంలో వైఎస్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి గౌరీపట్నంలో కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని ఓదార్చాక విజయరామరాజుపేట, కుముందానిపేట, కేజేపురం, అప్పలరాజుపురం తదితర గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రికి జగన్ మాడుగులలోని డీవీవీ సత్యనారాయణ ఇంట్లో బస చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి