Loading...

21, జనవరి 2011, శుక్రవారం

విగ్రహాలను తొలగించాలి

నర్సీపట్నం: జగన్‌ది ఓదార్పు యాత్రో, రాజకీయ యాత్రో ఆయన స్పష్టం చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. జిల్లాలో 18 మంది చనిపోతే రూ.10 కోట్లు ఖర్చుపెట్టి 10 రోజులపాటు యాత్ర చేయాలా అని ప్రశ్నించారు. యాత్ర సందర్భంగా అనుమతి లేకుండా 138 విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు.
రూ.100 కోట్లు ఆస్తి ఉన్న మద్దిలచెరువు సూరి భార్య రూ.10 కోట్లు ఖర్చుపెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మహత్మాగాంధీ విగ్రహం పక్కన వై.ఎస్‌.ఆర్‌. విగ్రహాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వీటిని తొలగించాలని హైకోర్టులో కేసు వేశానన్నారు. అనుమతి లేనివాటిని తక్షణం తొలగించాలని, ఎవరి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నదానిపై మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టును కోరామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన ఎం.పి. సబ్బంహరి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని అయ్యన్న విమర్శించారు. జగన్‌, ఆమె తల్లి విజయలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని పార్టీకి, పదవులకు రాజీనామా చేసి ఉంటే బాగుండేదన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి