Loading...

22, జనవరి 2011, శనివారం

ఈవీవీ హఠాన్మరణం

హైదరాబాద్‌ : ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
ఈవీవీ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఆర్యన్‌ రాజేశ్‌, 'అల్లరి' నరేశ్‌ఉన్నారు. ఈవీవీ 51సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈవీవీగా సినీరంగాన పేరు తెచ్చుకున్న ఈదర వీర వెంకట సత్యనారాయణ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. నిడదవోలులో విద్యాభ్యాసం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి