హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈమేరకు ఎంసెట్-2011 నిర్వహణలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమీక్షించేందుకు ఈనెల 29న కమిటీ తొలి సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు డీఎన్రెడ్డి, కన్వీనర్ రమణారావు సోమవారం తెలిపారు.
మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ దఫా ఇంటర్ గ్రూపులో తప్పనిసరిగా 50% మార్కులు ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర పరిస్థితులను తెలియజేస్తూ ఉన్నత విద్యాశాఖ ఏఐసీటీఈ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసింది. అక్కడి నుంచి వచ్చే సమాధానాన్ని అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా శాఖవర్గాలు భావిస్తున్నాయి. కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత షరతులతో నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి