పరవాడ, చైతన్యవారధి: లంకెలపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ (ఎస్.సి.ఇ.ఆర్.టి) ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. విశాఖ జిల్లాలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయాలు, సర్వశిక్షా అభియాన్ ద్వారా వచ్చే నిధుల వినియోగం, కార్యక్రమాల అమలుపై పరిశీలనకు ఆచార్య టి.ఎ.వి.తులసీరావు, విజయనగరం డైట్ అధ్యాపకుడు జి.జి.ఎస్.నాగేశ్వరరావు వచ్చారు. ఉపాధ్యాయులతో ఏర్పాటైన సమావేశంలో తులసీరావు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చెయ్యాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి