హైదరాబాద్: ఇంట్లోంచి కాలు బయటమోపకుండానే ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. అదీ సరిగ్గా ఏడు రోజుల్లోనే. ఈ వినూత్న విధానం తొలిసారిగా రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ లాంఛనంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేవలం ఒక్క క్లిక్‌తో ఓటరు గుర్తింపు
దరఖాస్తు ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ప్రతినిత్యం లక్షల మంది గుర్తింపు పత్రాల కోసం ఇబ్బందులు పడుతుంటారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయుడు ఈ విధానాన్ని ఉపయోగించి అతి సులభంగా ఓటరు కార్డును పొందవచ్చు.* ఓటరు కార్డు పొందాల్సిన (18 ఏళ్లు నిండిన) వారు నేరుగా ఆన్లైన్లోని www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* అందులో దరఖాస్తు పత్రాలు 6, 7, 8, 8ఏ ఉంటాయి.
* ఆరో నంబరు పత్రం కొత్త ఓటర్ల నమోదుకు, 7 నంబరు పత్రం వ్యక్తుల పేర్ల తొలగింపు, 8లో పేరు, చిరునామా మార్పు, 8ఏ ప్రతం అసెంబ్లీ నియోజకవర్గం మార్చు కోవడానికి నింపాల్సి ఉంటుంది.
* ఓటరుగా నమోదు కానున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలను జతచేయాలి.
* ఈ దరఖాస్తు నేరుగా సమీపంలోని పోస్టాఫీసుకు చేరుతుంది. ఆన్లైన్లో దీని ముద్రణ ప్రతి తీసుకుని పోస్టుమ్యాన్ చిరునామాలో పేర్కొన్న ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తారు. ఏవైనా మార్పులుంటే చేసి దాన్ని మళ్లీ ఆన్లైన్లో 'అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి'(ఏఈఆర్వో)కి పంపిస్తారు.
* ఏఈఆర్వో దాన్ని పరిశీలించి వివరాలను నిర్ధరించుకున్న తర్వాత దాన్ని తన పైఅధికారికి పంపిస్తారు.
* చివరికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) విచక్షణ మేరకుకార్డు జారీ చేస్తారు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ కార్డు పోస్టుమాన్ ద్వారా ఇంటికి చేరుతుంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి