హైదరాబాద్: ఓబుళాపురం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి నవరత్న హోదా పొందిన విశాఖ స్టీల్‌ప్లాంట్ క్యాపిటివ్ ఐరన్‌ఓర్
లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోందని రాఘవులు అన్నారు. సొంతంగా గనులు ఉన్న ఇతర కర్మాగారాలతో విశాఖ ఫ్యాక్టరీ పోటీపడలేక పోతోందని కనుక ఓబుళాపురం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని కోరారు. పార్లమెంటరీ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి