Loading...

5, జనవరి 2011, బుధవారం

మాస్టరు లిస్టు అభ్యర్థుల భిక్షాటన

విశాఖపట్నం, చైతన్యవారధి: గత 21 రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పోర్టు మాస్టరు లిస్టు అభ్యర్థులు మంగళవారం వినూత్నంగా నిరసనకు దిగారు. కలెక్టరేట్‌ కూడలిలో ప్రదర్శనగా నిల్చుని బిక్షాటన చేశారు. పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్లకార్డులను మెడలో వేసుకొని ప్రదర్శించారు.
అభ్యర్థులందరికీ ఉపాధి కల్పించే వరకు ఆందోళన చేస్తామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఛైర్మన్లు మారినంత మాత్రాన ఒప్పందాలను రద్దు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా యంత్రాంగం కళ్లు తెరిచి ఉపాధి కల్పించాలని సంఘం ప్రధాన కార్యదర్శి బి.వి.ఎస్‌.శేఖర్‌ కోరారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి