హైదరాబాద్: ఎన్టీఆర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఆయన నిస్వార్థ సేవ చేశారని చెప్పారు. ఎన్టీఆర్ 15వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నివాళులర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడే రోజు
వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం నేతలు దేవేందర్‌గౌడ్, విజయరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నన్నపనేని రాజకుమారి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి