Loading...

4, జనవరి 2011, మంగళవారం

అఖిలపక్ష సమావేశం జరుగుతుంది: చిదంబరం

ఢిల్లీ, జనవరి 4(న్యూస్ నెట్): శ్రీకృష్ణకమిటీ నివేదికకోసం జనవరి 6న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం జరుగుతుందని ఇది రద్దు కాలేదని హోంమంత్రి చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశానికి ఒక్కో పార్టీ తరపున ఇద్దరిని పిలిచామని ఒకరా లేక ఇద్దరు వస్తారా అనేది
ఆయా పార్టీల ఇష్టమని చిదంబరం అన్నారు. ఇద్దరు వచ్చినంతమాత్రాన భిన్నాభిప్రాయాలేం ఉండవు కదా అని ఆయన అన్నారు. గతంలో సీపీఐ, సీపీఎం, ఎంఐఎం తరపున ఇద్దరు చొప్పున వచ్చారని ఆయన అన్నారు. తెరాస కూడా సమావేశానికి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అఖిలపక్ష సమావేశం సమయాన్ని గురించి విలేకరులు ప్రశ్నించగా సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదని సమయం గురించి మీకెందుకని అన్నారు. నివేదిక బహిర్గతమైన తరువాత అల్లర్లు జరుగుతాయనే ప్రచారం నమ్మవద్దని కోరారు. ఏ విషయంపైన అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం జరుగుతుందని అన్నారు. సమావేశం చివర్లో మాత్రం అఖిలపక్ష సమావేశం 6వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని చెప్పారు. సమావేశం ముగియగానే నివేదికను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి