న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడు సతమతమవుతుంటే పెట్రో ధరలు పెంచి కోలుకోలేని దెబ్బ తీశాయని భాజపా, సీపీఎం పార్టీలు విమర్శించాయి. పెట్రో ధరల పెంపుపై భాజపా నాయకుడు ప్రకాశ్ జగదేవ్కర్ మాట్లాడుతూ.. దోపీడీ దారుల్ని అరెస్టు చేసే ప్రభుత్వమే దోపిడీకి దిగుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. బ్యారెల్ ముడి చమురు 140
డాలర్లు ఉన్నప్పుడే ధరలు ఇంతగా లేవని, ఇప్పుడు చమురు ధర తక్కువగానే ఉన్నా ధరలు పెంచేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పేరిట ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తాము ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిసున్నామని, పెంచిన ధరల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి