Loading...

19, జనవరి 2011, బుధవారం

దిగజారుతున్న బెల్లం ధరలు

అనకాపల్లి : బెల్లం ధరలు  రోజురోజుకు పతనమవుతున్నాయి. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం తిరిగి మార్కెట్‌ తెరిచారు. జిల్లా నలుమూలల నుంచి 23,964 దిమ్మలను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. ధరలు మాత్రం వంద కిలోలకు రూ. 46 తగ్గింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి.
జనవరి 4న రంగు బెల్లాలు వంద కిలోలు రూ. 2830 ధర పలకగా, మంగళవారం రూ. 2039లకు పడిపోయింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ నుంచి మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. 13న రూ. 2085 ధరలు పలికాయి. రోజురోజుకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూలీల ఖర్చులు కూడా రావని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రంగుబెల్లాలు రూ. 3270, నాసిరకాలు రూ. 2880 ధరలు పలికాయి. గత సంవత్సరం నాసిరకం ధరలు సైతం ఈ ఏడాది రంగు బెల్లాలకు పలకడంలేదు. జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నారు. ఇందులో సగం చెరకును బెల్లం తయారీ చేస్తారు. మునగపాక, అనకాపల్లి, ఎలమంచిలి, కశింకోట, చోడవరం, మాకవరపాలెం ప్రాంతాల్లో బెల్లం తయారీ ఎక్కువగా జరుగుతోంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి