Loading...

14, జనవరి 2011, శుక్రవారం

చోడవరానికి గోవాడ చక్కెర కర్మాగారం విద్యుత్తు

చోడవరం: గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో ఉత్పతవుతున్న విద్యుత్తును చోడవరం, వెంకన్నపాలెం, చీడికాడ విద్యుత్తు ఉపకేంద్రాలు ద్వారా ఈ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. చెరకు పిప్పితో ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తున్న విషయం  తెలిసిందే. ఇలా ఆరు మెగావాట్ల విద్యుత్తును పంచదార మిల్లు ఉత్పత్తి చేస్తోంది.
దీనిలో నాలుగు మెగావాట్ల విద్యుత్తును ఈ మూడు విద్యుత్తు ఉపకేంద్రాల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. మిగిలిన రెండు మెగావాట్ల విద్యుత్తును కశింకోటలోని 130 కె.వి. విద్యుత్తు కేంద్రానికి పంపిణీ అవుతుందని విద్యుత్తుశాఖ ఏడీఈ పూడి చెల్లిబాబు తెలిపారు. స్థానికంగా ఉత్పత్తయ్యే విద్యుత్తును వినియోగిస్తుండటం వల్ల మెరుగైన విద్యుత్తు అందుతుందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి