విశాఖపట్నం, చైతన్యవారధి: నగరంలో 'గడప గడపకూ కాంగ్రెస్' పేరిట పాదయాత్రను మంగళవారం ఆరంభించారు. సిరిపురంలోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లిన నాయకుంతా అనేక పదవులు అనుభవించారని,
ఇంత స్థాయికి తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. ఎవరు పార్టీని వీడినా కొత్త నాయకులకు అవకాశం వస్తుందే తప్ప కాంగ్రెస్‌కు వచ్చిన ప్రమాదం ఏమీలేదన్నారు. పి.సి.సి. మాజీ సభ్యుడు జీఏ నారాయణ మాట్లాడుతూ నగరంలో అన్ని వార్డుల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యంగా పార్టీని వీడిన కార్పొరేటర్ల వార్డుల్లోనే మొదటగా నిర్వహిస్తామన్నారు. అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పథకాలు, కార్పొరేటర్లు పార్టీకి చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ ఛైర్మన్ ఎం.ఎ.రసూల్, వైస్ ఛైర్మన్ వి.శ్రీనివాసరావు, ఎస్.సి. సెల్ ఛైర్మన్ పి.రమణ, నగర మహిళా అధ్యక్షులు సయ్యద్ అబిద, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు వి.శ్యామ్‌సుందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు కొణతాల రాధ, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి