విశాఖపట్నం, చైతన్యవారధి: బ్రెయిలీ అంధులకు దిక్సూచిలాంటిదని కలెక్టరు జె.శ్యామలరావు అన్నారు. అంధులందరికీ బ్రెయిలీలిపి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. బ్రెయిలీ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్.ఎస్.టి.ఎల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్.ఎస్.టి.ఎల్ మానసి
ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంధవిద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను అందించాలన్న ఎన్.ఎస్.టి.ఎల్ సేవా సమితి చేసిన ప్రయత్నం ఆదర్శనీయమన్నారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ప్రింటింగ్‌ను ప్రారంభించారు. ఎన్.ఎస్.టి.ఎల్ డైరెక్టరు డాక్టరు ఎన్.భుజంగరావు మాట్లాడుతూ త్వరలో పుస్తకాల్ని అందజేస్తామన్నారు. అసోసియేట్ డైరెక్టరు ఎస్.వి.రంగరాజన్, లలితాభుజంగరావు ప్రసంగించారు. సివిల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎం.జి.రెడ్డి, కార్యదర్శి కె.ఈశ్వర్రావు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి