విశాఖపట్నం: జగన్ వర్గం తరపున ముఖ్యమంత్రిపై మాటల దాడికి దిగుతున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై విశాఖ నగర శాసనసభ్యులు మొదటిసారిగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని పార్లమెంటు సభ్యుడై ఉండీ మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం, రచ్చబండ కార్యక్రమంలో
పాల్గొనకపోవడాన్ని సబ్బం హరి ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం ద్వారా కార్యకర్తలను అయోమయంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్న హరి కాంగ్రెస్ జెండా పట్టుకోకుండా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో శాసనసభ్యులు తైనాల విజయ్‌కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్‌లు మాట్లాడారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి