హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రస్తుతం కీలకమైన, సున్నితమైన అంశం తెలంగాణ సమస్య మాత్రమేనని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ అంశం, ఆయన వెంట వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారం అంత తీవ్రమైనది కాదన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలో ఉందన్నవారు
అవిశ్వాసతీర్మానం పెట్టి చూడాలన్నారు. తెలంగాణ విషయంపై కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకునేందుకు తెదేపా సహకరించాలన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి