హైదరాబాద్, జనవరి 4(న్యూస్ నెట్): సంపూర్ణ ఆరోగ్యం గలవారితో కూడా అంధులు పోటీ పడగలుగుతున్నారంటే అందుకు బ్రెయిలీ లిపీయే కారణమని, దీన్ని కనిపెట్టిన బ్రెయిలీని అంధులు దేవుడిగా కొలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా మంగళవారం
హైదరాబాద్‌లో నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల పార్కులో లూయి బ్రెయిలీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నల్గొండ ఫ్త్లెఓవర్కు లూయి బ్రెయిల్ ఫ్త్లెఓవర్గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.4.50 కోట్లతో చేపట్టే వికలాంగుల సంక్షేమ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 2011 క్యాలెండరును ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 25 మంది వికలాంగులకు బహుమతులను అందజేశారు. లూయి బ్రెయిలీ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గంగారం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు వర్తించే పథకాలు, రాయితీలను వికలాంగులకు కూడా ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ రాజ్యాంగ నియమాల పరధిలోకి వచ్చే అంశాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్షారెడ్డితో పాటు ముఖేష్‌గౌడ్, శంకర్రావు, ఎమ్మెల్యే మహ్మద్ బలాల, సుధీర్‌రెడ్డి, మేయర్ కార్తీకరెడ్డి, జీహెచ్ఎంసీ, కమిషనరు సమీర్‌శర్మ, వికలాంగుల సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి