Loading...

15, జనవరి 2011, శనివారం

దేశ వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం గంగ, యమున తదితర పవిత్ర నదుల్లో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా దేవాలయాలకు వెళ్లి భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహించారు. రాజస్థాన్‌ ప్రభుత్వం జైపూర్‌లో జల్‌మహల్‌ ప్రాంతంలో పతంగుల ఉత్సవాన్ని నిర్వహించింది. ఒరిస్సా ప్రజలు బియ్యం, పాలు, వెన్న, కొబ్బరితో చేసిన ప్రత్యేక పిండి వంటలను తయారు చేసి, సూర్యునికి నైవేద్యంగా పెట్టారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు శనివారం ప్రధాన సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. రంగవల్లికలు, హరిదాసు కీర్తనలతో తెలుగు లోగిళ్లు సంక్రాంతి కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి