హైదరాబాద్: తెలంగాణకోసం అస్తమానం ఢిల్లీలో అద్వానీ, సుష్మాస్వరాజ్లను కలుస్తున్న తెరాస అధినేత కేసీఆర్ 2009నుంచి ఏ ఒక్కరోజుకూడా యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీని కని ప్రధానిని కాని కలిసి తెలంగాణ అంశం ప్రస్తావించలేదని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన
అధికార పార్టీ నేతలను అడగకుండా విపక్షాలనెందుకు అడగటమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో విలీనం అవమని తాము తెరాసను అడగలేదని కేసీఆరే గతంలో ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని కేసీఆర్ అనటాన్ని ఆయన ఖండించారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని నేతలు చెబుతున్నారన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి