న్యూఢిల్లీ: తాను భారతీయురాలినని, బహిరంగంగా దుస్తులు ఇప్పటం వంటివి చేయనని మోడల్ పూనం పాండే స్పష్టం చేశారు. భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే దుస్తులు ఇప్పుతాననడం అభిమానుల నుంచి స్పందన కోసమేనని, సరదాగా చేసిన వ్యాఖ్య అని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఫేస్బుక్లో తన ఫొటోలు...
పెట్టి ఫ్యాన్స్ పేజీని మొదలుపెట్టినా సంతృప్తి కలగలేదని, తర్వాత వచ్చిన ఈ ఆలోచన మాత్రం మంచి ఫలితం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆలోచన తన సొంత నిర్ణయమన్నారు. ''ప్రకటన తర్వాత కోర్టు కేసులు, అరెస్టు వారెంట్లు, కొన్ని ఫోన్లు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. బహిరంగ ప్రాంతాలకు వెళ్లడం మానేశా. అయితే, ఇదో మంచి అనుభవం. ఎంత భయపడ్డానో అంత ఎంజాయ్ చేశా'' అని తెలిపారు. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఐటం సాంగ్స్ చేయమని కూడా అడుగుతున్నారని.. ఇంకా ఏమీ ఒప్పుకోలేదని చెప్పారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి