రైల్వేల్లోనూ 'మత్తు' జాడ్యం నెలకొంది. విధుల్లో చేరడానికి ముందు నిర్వహించిన పరీక్షలో కొందరు డ్రైవర్లు మత్తులో తూగుతున్నట్లు తేలింది. రోజువారీ తనిఖీల్లో భాగంగా వివిధ డివిజన్లలో డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 15 మంది మద్యం సేవించినట్లు తేలిందని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వీరిని రైలు నడపకుండా బహిష్కరించడంతోపాటు, క్రమశిక్షణ, సర్వీస్ నిబంధనల ఉల్లంఘన తదితర ఆరోపణలపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఒక్క మొరాదాబాద్ రైల్వే డివిజన్లోనే 11 కేసులు నమోదయ్యాయి. ఇక మన రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడల్లో ఒకొక్కరు చొప్పున దొరికారు. లక్నో, అంబాలా డివిజన్లలో ఒక్కో కేసు నమోదైంది. ''డ్రైవర్ (లోకోపైలట్), సహాయ డ్రైవర్(అసిస్టెంట్ లోకోపైలట్)లు రైలు నడపడానికి ముందు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్షకు హాజరవ్వాలి. ఒకవేళ మద్యం తాగినట్లు ఆ పరీక్షలో తేలితే విధుల్లో చేరేందుకు అనుమతి లభించదు''అని అధికారులు వివరించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి