Loading...

31, ఆగస్టు 2011, బుధవారం

దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: దేశవాప్తంగా నేడు ముస్లింలు రంజాన్‌ పండుగను జరుపుకుంటున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో గడిపిన ముస్లిం సోదరులు మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఈరోజు ఈదుల్‌ఫితర్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. హైదరాబాద్‌లో మీరాలం ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గాలతోపాటు మసీదులు, ప్రార్థనాలయాలు ఈరోజు ఉదయం జరిగే ప్రత్యేక ప్రార్థనలకోసం ముస్తాబయ్యాయి. రంజాన్‌ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి