![]() |
సింహాద్రి ఎన్టీపీసీ ముందు ధర్నా నిర్వహిస్తున్న మత్స్యకారులు |
పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం ఉపాధిపై తమకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యాన మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. ఎన్టిపిసి పరిపాలనా భవనం వద్దకు ముత్యాలమ్మపాలెం మాజీ సర్పంచి చింతకాయల ముత్యాలు, మాజీ ఎంపిపి ఎం.నీలబాబు, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు మాసవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో సుమారు 500 మంది మత్స్యకారులు మంగళవారం చేరు కున్నారు...
కాలుష్యం వల్ల నష్టపోతున్న ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోని మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని ఎన్టిపిసి యాజమాన్యం రెండేళ్ల క్రితం హామీ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోకపోవడంతో వారు ఈ ఆందోళన చేపట్టారు. ఎన్టిపిసినుంచి ప్లైయాస్ బూడిదను ఉప్పుటేరు ద్వారా సముద్రంలో వదులుతుండడంతో మత్స్య సంపద అంతరించిపోతోందని, చేపట వేట సాగడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో పరవాడ, గాజువాక పోలీసులు, ఎన్టిపిసి సిఎస్ఎఫ్ పెద్దఎత్తున మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అయినా, మత్స్యకారులు భయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో, ఎన్టిపిసి యాజమాన్యం మత్స్యకార ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో ఎన్టిపిసినుంచి ఇన్ఛార్జి హెచ్ఆర్ డిజిఎం బాలకృష్ణారావు, కుమార్, టిడిపి నేతలు పాల్గొన్నారు. జిఎం, డిజిఎం సెలవులో ఉన్నందున వచ్చేనెల 11 వరకూ గడువు కావాలని యాజమాన్య ప్రతినిధులు కోరారు. గంగవరం పోర్టు, హెటిరో డ్రగ్స్ మాదిరిగానే ఇక్కడ కూడా ప్యాకేజీ అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరినట్లు టిడిపి నాయకులు తెలిపారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్ఛార్జి డిజిఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇందల కొండలరావు, కె.రామకృష్ణరాజు, బొండా సన్యాసిరావు, ముత్యాలమ్మపాలెం మత్స్యకారు లు, పరవాడ ఎస్ఐ పి.పైడిపునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి