అచ్యుతాపురం, చైతన్యవారధి: రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అప్పారావు సెజ్ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఉద్దపాలెంలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. రైతులైన తాము నేడు దినసరి కూలీలుగా మారామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేవారు. ఉపాధి కల్పనలో అన్యాయం జరిగినట్లు నిర్వాసితులు వాపోయారు.
వెదురువాడలో పునరావాసం కల్పిస్తామని చెప్పిన అధికారులు, పాలకుల వాటిని మరచిపోయారన్నారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్, ఆర్డీఓ కూర్మనాథ్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ దుర్గాప్రసాద్, ఎపిఐఐసి డిజిఎం యతిరాజులు, జిల్లా పరిశ్రమ శాఖ కమిషనర్ నాయక్, తహసిల్దార్ సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.
రాంబిల్లి మండలంలో... రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పిఎస్ అప్పారావు గురజాపాలెం గ్రామంలో మంగళవారం సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వలేదని నిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ కూర్మనాథ్్, తహసిల్దార్ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి