హైదరాబాద్ : తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగసంఘాల ఐకాస నేత స్వామిగౌడ్‌పై తెలంగాణ అధికారుల, ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్తపోరాటసమితి గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఉద్యోగసంఘాలకు రావాల్సిన స్థలాల్ని స్వామిగౌడ్ ఆక్రమించారంటూ వారు ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో సంఘాలకు గృహనిర్మాణాల కోసం కేటాయించిన 160 ఎకరాల స్థలం ఆక్రమణకు కుట్ర జరుగుతోందంటూ వారు గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్టు వారు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి