Loading...

27, అక్టోబర్ 2011, గురువారం

విజయవాడలో కార్తీక మాస పుణ్యస్నానాలు

విజయవాడ: కార్తీక మాసం ప్రారంభం రోజు కావడంతో విజయవాడ కృష్ణాతీరం భక్తులతో కిటకిటలాడింది. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో దుర్గాఘాట్‌కు చేరుకొని కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులు, మహిళలు తరలివచ్చి కార్తీక పాడ్యమి స్నానాలు ఆచరించారు. రావి చెట్టు కింద దీపారాధన చేశారు. తమ ఇష్ట దైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి