Loading...

1, నవంబర్ 2011, మంగళవారం

ఎన్టీఆర్‌ మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. సచివాలయం వద్ద తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకి పూలమాలలు వేసి అనంతరం ఎన్టీఆర్‌ మైదనానికి చేరుకున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం దృష్ట్యా ఎన్టీఆర్‌ మైదానానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మైదానం పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌ మినహా తెలంగాణ మంత్రులెవరు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి