Loading...

25, జూన్ 2012, సోమవారం

వికలాంగ విద్యార్దులకు పరికరాలు పంపీణీ

పరవాడ, జూన్ 25(చైతన్యవారధి): స్ధానిక మండల రిసోర్స్ సెంటర్ లో వికలాంగ విద్యార్ధులకు ఉపయోగకర పరికరాలను సోమవారం అందజేశారు. ఎంఇవో కె.జె.ఎల్. మోహనరావు ఈ పరికరాలను అందజేశారు. మండలంలో వివిధ పాఠశాలలకు చెందిన 35 మంది విద్యార్ధులకు కళ్ల అద్దాలు, ఏడుగురు విద్యార్ధులకు వినికిడి యంత్రాలు అందజేశారు. సర్వశిక్షా అభియాన్ పథకంలో భాగంగా ఈ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఇఅర్ టీలు మల్లీశ్వరీ, చంద్రకళ, ఎంఆర్పీలు గోపాలకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి