కర్నూలు: అధికారం తనకు కొత్తకాదని, అధికారం కోసం కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలు పాకులాడుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా బెల్డోనా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పేదలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు ఎంత కష్టపడినా మిగిలేది అప్పులేన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం గొలుసు దుకాణాల వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే బెల్టుషాపులను రద్దు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి