గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. 2012లో ఈచిత్రం బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు....టాలీవుడ్ చరిత్రలో పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సరదా'(తాత్కాలిక టైటిల్) చేయడానికి రెడీ వుతున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని ఓ దేవాలయంలో ఇటీవల జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి