Loading...

21, నవంబర్ 2012, బుధవారం

చంద్రబాబుతో వైయస్ జగన్ గేమ్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో మైండ్ గేమ్ ఆడుతూనే మరోవైపు విభజించి పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెసు నుండి వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత జగన్ పార్టీ అప్పుడప్పుడు దూకుడుగా మరికొన్ని సందర్భాల్లో స్తబ్దుగా ఉంటూ వస్తోంది. అవసరం అనుకున్న సమయాల్లో జగన్...
ఒరలో నుండి కత్తిని తీసినట్లుగా.. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తన వైపుకు రప్పించుకుంటున్నారని అంటున్నారు.
ముందే వారితో చర్చలు జరిపి పార్టీకి లబ్ధి చేకూరుతుందనుకున్న సమయంలో వారిని పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. అప్పటి వరకు అలాంటి నేతలు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా జగన్ పక్కా వ్యూహంతో 2014 ఎన్నికల వరకు లేదా ముందస్తు ఎన్నికలు వచ్చే వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇటీవల టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కొడాలి నాని, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు కోమటిరెడ్డి సోదరులు, ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు... ఇలా ఎవరిని తీసుకున్నా సొంత పార్టీ పైన విమర్శలు చేస్తూ కొనసాగుతూనే అవసరమైన సమయంలో జగన్ పార్టీలోకి వెళ్లే వ్యూహంతో ఆ నేతలు ఉన్నారని అంటున్నారు. ఇదంతా జగన్ మైండ్ గేమ్‌గా చెబుతున్నారు. అంతేకాదు.. విభజించి పాలించు అనే సూత్రాన్ని కూడా అమలుపరుస్తాన్నారని అంటున్నారు.
మంత్రి ధర్మాన, మైలవరం ఎమ్మెల్యే దేవినేని, జలగం ఫ్యామిలీలే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. అయితే మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని, తమ పార్టీలోకి వస్తామని చర్చలు జరుపుతున్న వారి పేర్లనే తాము చెబుతున్నామని, రాజకీయాల్లో ఒకే కుటుంబంలోని వారు వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉండటం కోకొల్లలు చూస్తున్నామనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి