హైదరాబాద్: పాఠశాలలకు జనవరి 11 నుంచి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆర్నెల్ల పరీక్షలను జనవరి 4-10 మధ్య నిర్వహించుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 17 నుంచి జరగాల్సిన ఆరు నెలల పరీక్షలను ప్రపంచ తెలుగు మహాసభల కారణంగా
జనవరికి వాయిదా వేశారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు జనవరి 12 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు.
జనవరికి వాయిదా వేశారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు జనవరి 12 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి