విశాఖపట్నం, చైతన్యవారధి:సీతమ్మధార ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రైతుబజార్ వద్ద చిల్లర నాణేల పంపిణీ చేపట్టారు. రైతులు, బజారుకు వచ్చిన వినియోగదారులు, బ్యాంకు ఖాతాదారులు క్యూకట్టారు. సుమారు రూ.2లక్షల విలువ చేసే రూపాయి, రెండు రూపాయలు, పది రూపాయల
నాణేలను నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఆంధ్యాబ్యాంకు జోనల్ మేనేజర్ బి.భాస్కరశర్మ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సీతమ్మధార, ద్వారకానగర్ ఆంధ్రాబ్యాంకు శాఖలలోగల కాయిన్ వెండింగ్ మిషన్ ద్వారా కూడా నాణేలు అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో ఎం.వి.పి.కాలనీ రైతుబజారులో చిల్లర నాణేల పంపిణీ చేపడతామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ డి.కె.రథ్, ఎస్.ఎ.వి.ప్రసాద్, సీనియర్ మేనేజర్ ఎన్.బి.ప్రకాశరావు, మేనేజర్లు ఎం.కృష్ణకుమార్, టి.శ్రీనివాసరావు, టి.మాధవరావు, ఉద్యోగులు ఐ.కేశవరావు, ఆర్.వి.రవికుమార్, ఆర్.వసంతరావు, నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి