Loading...

3, డిసెంబర్ 2012, సోమవారం

డీఎస్సీ-2012 ప్రతిభావంతుల జాబితా విడుదల

విశాఖపట్నం, చైతన్యవారధి: డీఎస్సీ-2012లో ఎంపికైన ప్రతిభావంతుల ప్రాథమిక జాబితా విడుదలైంది. కలెక్టర్‌ వి.శేషాద్రి ఆమోదం లభించడంతో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) కె.కృష్ణవేణి ఆదివారం ఈ జాబితాను ప్రకటించారు. ఈ వివరాలను అంతర్జాలంలో పొందుపరిచారు. దీంతోపాటు కలెక్టర్‌, డీఈవో కార్యాలయాల్లో నోటీసు బోర్డులో కూడా అతికించారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 775 (ప్రభుత్వ, జెడ్పీ), 132 జీవీఎంసీ కలిపి మొత్తం 907 ఖాళీలను
గుర్తించామని డీఈఓ తెలిపారు. అయితే మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ అభ్యర్థులు లేకపోవడం వల్ల 268 ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. మిగిలిన 639 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక జాబితా సిద్ధం చేశామన్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఉద్యోగాలను విభజించి జాబితాను రూపొందించామని ఆమె పేర్కొన్నారు.sites.google.com/site/deoVizag, sites.google.com/site/Vizagbadi చిరునామాల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను చూడగలరని తెలిపారు. నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించడానికి చర్యలు చేపట్టామన్నారు. విద్యార్హత, కులము, రిజర్వేషన్ల కోటాలో ఎంపికైన అభ్యర్థులకు చెందిన ఆయా ధ్రువపత్రాలు పరిశీలిస్తామన్నారు. రైల్వే కాలనీ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.

ఇదీ షెడ్యూల్‌..
* సోమవారం పాఠశాల సహాయకులు, భాషా పండితులు, నాన్‌ లాంగ్వేజి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
* మంగళవారం భాషా పండిట్లు, పీఈటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
* బుధవారం మాధ్యమిక విద్యా గ్రేడ్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

* నిర్ణయించిన తేదీల్లో ఎంపికైన అభ్యర్థులు గైర్హాజరైతే ఈ నెల 9న ధ్రువపత్రాల పరిశీలిస్తామన్నారు. ఒక వేళ 9న కూడా హాజరు కాకపోతే జాబితా నుంచి వారి పేర్లను తొలగించి తరువాత ప్రతిభగల అభ్యర్థులను గుర్తించి 10న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ చెప్పారు. 15న తుదిజాబితా ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉద్యోగాల్లో నియమించడానికి ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు విభాగాల వారీగా..
మొత్తం 639 మందితో ప్రాథమిక ప్రతిభావంతుల జాబితా సిద్ధం చేశారు. వాటిలో మాధ్యమిక విద్యా గ్రేడ్‌ (ఎస్జీటీ) ఉద్యోగాలు 532 కాగా పాఠశాల సహాయకులు(ఎస్‌ఏ)లు 107 చొప్పున ఉన్నాయి. ఎస్‌ఏలు(మైదానంలో) గణితం 19 (ఆంగ్లం 4 + తెలుగు 15), సాంఘిక శాస్త్రం 6 (ఆంగ్లం 2 + తెలుగు 4), బయలాజికల్‌ సైన్స్‌ 9 (ఆంగ్లం 2 + తెలుగు7), భౌతికశాస్త్రం 19 (ఆంగ్లం 4 + తెలుగు 15), తెలుగు 2, ఆంగ్లం 13, హిందీ 25, ఏజెన్సీలో గణితం 1, హిందీ 3, భౌతికశాస్త్రం 4, బయలాజికల్‌ సైన్స్‌ 4, సాంఘికశాస్త్రం 2 ఉన్నాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి