వాషింగ్టన్: అంగారకుడిపైకి క్యూరియాసిటీ రోవర్‌ను పంపి విజయం సాధించిన నాసా అదే ఉత్సాహంతో మరో రోవర్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. అంగారకుడికి సంబంధించిన విభిన్న కార్యక్రమాల్లో భాగంగా.. 2020లో రోబోటిక్ సైన్స్ రోవర్‌ను పంపనున్నట్లు ప్రకటించింది. క్యూరియాసిటీ ఇప్పటికే అంగారకుడిపై జీవం
మనుగడకు అవసరమైన నీరు, ప్రాణవాయువుకు సంబంధించిన సమ్మేళనాలను గుర్తించినట్లు నాసా పేర్కొంది. తమ తదుపరి కార్యక్రమంతో అంగారక పరిశోధనల్లో అమెరికా ప్రపంచ నేతగా నిలబడి పోతుందని నాసా అడ్మినిస్ట్రేటర్ ఛార్లెస్ బోల్డెన్ తెలిపారు. 2030ల్లో అక్కడికి మనుషులనూ పంపటం ద్వారా చరిత్రాత్మక అడుగువేస్తామన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి