హైదరాబాద్: పంచాయతీ సెక్రటరీ (కేటగిరి-4) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన త్వరలో ఏపీపీఎస్సీ జారీచేయబోతుంది. 2,670 పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం కమిషన్కు అందింది. పరీక్ష వరకు మాత్రమే ఎపీపీఎస్సీ నిర్వహిస్తుంది. నియామకాల ప్రక్రియ జిల్లా అధికారుల నేతృత్వంలో జరగనుంది. పోస్టుల వివరాలు
సిద్ధంగా ఉన్నా అదనపు సమాచారం అవసరమైనందున కమిషన్ అధికారులు రెండు రోజుల నుంచి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తొలుత డిసెంబరు 31వ తేదీలోగా ఉద్యోగాల ప్రకటన జారీచేస్తే వయోపరిమితిపరంగా అభ్యర్థులు నష్టపోకుండా ఉంటారని ఏపీపీఎస్సీ వర్గాలు భావించాయి. అయితే ప్రకటన జారీకి అవసరమైన సమాచారంలో స్పష్టత లేనందున ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడంలేదు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. సోమవారం లేదా జనవరిలో ఈ ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడనుంది. అలాగే 37 చక్కెర ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రకటన సోమవారం జారీ కాబోతుంది. ఈ పోస్టులు సుమారు రెండువేల వరకు ఉంటాయని భావిస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి