లండన్: కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద వాతావరణం ఎలా ఉండేది? ఇప్పుడు ప్రాణవాయువుగా ఉన్న ఆక్సిజన్ అప్పుడు కూడా ఉండేదా?.. ఇటువంటి ఆసక్తికర ప్రశ్నలకు అమెరికా శాస్త్రవేత్తలు సమాధానం కనుగొనే ప్రయత్నం చేశారు. దక్షిణాఫ్రికాలో 1980లలో దొరికిన కొన్ని శిలాజాలపై వారు పరిశోధనలు జరిపారు.
బూడిదలాంటి ఉపరితలంపై వర్షపు చినుకులు పడినప్పుడు ఏర్పడిన గుంటలతో ఈ శిలాజం రూపొందింది. ఇది 270 కోట్ల ఏళ్ల నాటిది. శిలాజంపైన ఉన్న గుంటల విస్తీర్ణాన్ని లెక్కించటం ద్వారా.. ఎంత వేగంతో వర్షపు చినుకులు వాటిపై పడ్డాయన్నది శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తద్వారా నాటి ప్రాచీనకాలంలో భూమ్మీద గాలి సాంద్రత ఎలా ఉండేదన్నది కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త సంజోయ్ సోమ్ మాట్లాడుతూ.. 'అప్పట్లో భూమ్మీద ఆక్సిజన్ లేదు. నైట్రోజన్ మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగానే నాటి వాతావరణంలోనూ కొంతమేరకు ఉండేది. కార్బన్డయాక్సైడ్, మీథేన్ వంటివి చాలా ఎక్కువ మోతాదులో ఉండేవి. ఇదంతా ఒక ప్రతిపాదన మాత్రమేగానీ.. కచ్చితమైన అంచనా కాదు' అని చెప్పారు. శిలాజం నుంచి మరిన్ని వివరాలు రాబట్టటానికి సంజోయ్ బృందం పరిశోధనలు జరుపుతోంది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి