విశాఖపట్నం, చైతన్యవారధి: గవరం ఓడరేవులో భాగంగా రూ.4500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 5 మిలియన్ టన్నుల 'పెట్రోనెట్ ఎల్.ఎన్.జి. లిమిటెడ్' (పి.ఎల్.ఎల్.) ద్రవీకృత సహజవాయు టెర్మినల్పై ప్రజాభిప్రాయ సేకరణ వచ్చే నెల 3వ తేదీన జరగనుంది. వాస్తవంగా నవంబరు 9వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.
ఆ సమయానికి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగమంతా తుపాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండడంతో దానిని వాయిదా వేశారు. తాజాగా వచ్చే నెల 3వ తేదీని ఖరారు చేశారు. ఈ మేరకు ఎ.పి.కాలుష్య నియంత్రణ మండలి ప్రకటన జారీ చేయనుంది. గంగవరం రేవు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి