రికార్డుల్లోకెక్కిన భవన నిర్మాణం
మొహాలీ: 48 గంటల్లో పదంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. పంజాబ్ మొహాలీలో 25 వేల చదరపు మీటర్లలో చేపట్టిన ఈ నిర్మాణం శనివారం సాయంత్రం నిర్దిష్ట కాలవ్యవధి మేరకు పూర్తయింది. 200 మందికిపైగా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి భారత్‌లోనే అత్యంత వేగంగా పూర్తయిన భవనంగా
రికార్డు సృష్టించారు. నిర్దేశిత 48 గంటల వ్యవధిలో 25 వేల చదరపు మీటర్లలో 200 టన్నుల భవనాన్ని అసెంబ్లింగ్ చేశామనీ, శనివారం సాయంత్రం 4.30కి పూర్తయిందని మొహాలీకి చెందిన 'సినర్జీ త్రిస్లింగ్టన్' కంపెనీ సీఎండీ హర్పాల్ సింగ్ తెలిపారు. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన పదంతస్తుల భవనంగా రికార్డు సృష్టించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. భవనం 600 ఏళ్లపాటు మన్నుతుందని దీనిని డిజైన్ చేసిన పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రొఫెసర్ ఐసీ స్యాల్ పేర్కొన్నారు. ట్యూబ్ఇన్ట్యూబ్ పద్ధతిలో చేపట్టిన ఈ భవనంలో డ్రైనేజీ, నీరు కారటం వంటి సమస్యలు తలెత్తవన్నారు. బలమైన గాలులు, భూకంపాలు తలెత్తినప్పుడు భవనం తట్టుకుని నిలబడే విక్షేప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
కంపెనీ సీఎండీ హర్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఎయిర్ కండీషనింగ్, దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం వంటివన్నీ తర్వాత ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణాన్ని మాత్రమే మీడియాకు చూపించారు. ఇది మనదేశంలో సాధ్యమేనని చూపాలనుకున్నామన్నారు. పేదప్రజల గృహాల కోసం ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణ పరిజ్ఞానాన్ని దేశంలోనే మొదటిసారిగా ఉపయోగించామనీ, ఇది నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తుందన్నారు. నిర్మాణంలో ఉపయోగించిన కాంపోనెంట్లన్నీ కర్మాగారంలో తయారైనవేననీ, ఫ్లోర్లు, నీటి సరఫరా, విద్యుత్తు వైరింగ్, సానిటేషన్, ఎయిర్ కండీషన్ మార్గాలు వంటివన్నీ ప్రత్యేక తరహాలో చేపట్టామన్నారు. పునాదిలో మాత్రమే కాంక్రీటును వాడామన్నారు. మూడు అంగుళాల మందం ఫ్లోరింగ్‌లను నట్లు, బోల్టులతో బిగించినట్లు చెప్పారు. ఇన్స్టాకాన్ భవనం నిర్మాణం గురువారం సాయంత్రం 4.30కి మొదలవగా, శనివారం 4.30కి పూర్తయింది. పదంతస్తుల 'ఇన్స్టాకాన్' ఆకాశహర్మ్యం నిర్మాణానికి మూడు క్రేన్లు వాడారు. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన నిర్మాణమనీ, దుమ్ము, నీటికాలుష్యం వంటివి ఉండవని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. స్థానిక సంస్థల నుంచి అవసరమైన అనుమనుతలన్నీ నిర్మాణం పూర్తయ్యేసరికి తీసుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి, నిర్మాణ ఇంజినీరింగ్ పరిశోధన కేంద్రం అనుమతులు ఉన్నట్లు చెప్పారు. అమెరికాలో ఇలాంటి భవనాలు 100 అంతస్తులదాకా నిర్మిస్తారనీ, తాజా భవనానికి సైతం భవిష్యత్తులో మరిన్ని అంతస్తులు పెంచవచ్చనీ, తేలికగా తొలగించవచ్చన్నారు. ఈ భవనంలో కార్బన్‌డైఆక్సైడ్ ఎక్కువైతే, వెంటనే గుర్తించి సర్దుబాటు చేయవచ్చన్నారు. ఇది తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటుందనీ, ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పద్ధతిలో నిర్మించినట్లు చెప్పారు. హోటళ్లు, ఆస్పత్రులు, రిటైల్ మాల్స్, విద్యా, వాణిజ్య సంస్థలు వంటివాటికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. సిమెంట్ ధరలు పెరగడం, కార్మికులు, తదితర సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయుక్తమన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి