హైదరాబాద్‌లో అయిదుగురు అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లో రూ.7 కోట్ల విలువైన గుప్తనిధి బయటపడింది. పురాతన కాలం నాటి బంగారు నాణేలు విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పాతబస్తీలోని దూద్‌బౌలి నివాసి సతీష్‌కుమార్ తాతలకాలం నాటి శిథిలమైన ఇంటిని కూల్చేస్తుండగా అందులో బంగారు
నాణేలు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. వీటిని ఇంటిని కూల్చే కాంట్రాక్టు తీసుకున్న మహ్మద్ రఫీక్, మహ్మద్ అబ్దుల్‌బారీ నలుగురు పనివాళ్లు 80:20 నిష్పత్తిలో పంచేసుకున్నారు. ఓ వ్యక్తి రెండు, మూడు నాణేలను ముంబయిలో విక్రయించాడు. మరోమారు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం 1.69 కిలోల బంగారు నాణేలు, 4.2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పురావస్తుశాఖ అధికారులకు చూపించగా... మొగల్ చక్రవర్తి షాజహాన్, నిజాం నవాబు కాలంలో చెలామణి అయిన బంగారు నాణేలని ధ్రువీకరించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 లక్షలే అయినా.. వీటికున్న చరిత్ర ఆధారంగా రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. అయిదుగురిపై భారత గుప్త నిధుల చట్టం (ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్) ప్రకారం కేసులు నమోదు చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ చెప్పారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి