Loading...

10, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగువారి మధ్య చిచ్చుపెడితే సహించం

సమైక్యాంధ్ర జేఏసీ
విశాఖపట్నం, చైతన్యవారధి: తెలుగువారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సమైక్యాంధ్ర సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్‌ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ విభజనపై సానుకూలంగా మాట్లాడిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్కేబీచ్‌లోని
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కమిటీ కన్వీనర్‌ మహేష్‌ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి త్యాగమూర్తుల ప్రాణార్పణతో ఏర్పడిన తెలుగు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విభజించేందుకు సాహసిస్తే వూరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణవాదుల ఒత్తిడితో తెలుగు ప్రజలను విడదీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డిసెంబర్‌ 9 ప్రకటన పునరావృతం కాకుండా చూడాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ భవితకు తెలుగు ప్రజలు సమాధికడతారన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధి జె.టి.రామారావు, బీసీ సంఘం నగర అధ్యక్షుడు నరవ రాంబాబు, ఎండీఎస్‌ఎఫ్‌ నాయకుడు శ్యాం, సుమంత్‌, ఫలకా శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి