హైదరాబాద్: మొక్కల దిగుమతి, రవాణా ద్వారా కొన్ని రకాల చీడపీడలు ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున వీటిపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల నుంచి ఉద్యానవన మొక్కలను దిగుమతి చేసుకోవాలంటే... వాటి ద్వారా ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం లేదని ధ్రువీకరణ
పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొబ్బరి మొక్కలు(విత్తనం) దిగుమతి తీసుకోవడానికి ఎర్రమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడలు రావని కేరళలోని కొబ్బరి పరిశోధన కేంద్రం; కాఫీ విత్తనాలు, మొక్కలు దిగుమతికి కర్ణాటకలోని కాఫీ పరిశోధన మండలి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో బంగాళదుంప, రబ్బరుతో పాటు మరికొన్ని మొక్కల దిగుమతికి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని జీవోలో పేర్కొన్నారు. ప్రత్యేకించి వెస్టిండీస్, ఆఫ్రికా, శ్రీలంక, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉద్యానవన మొక్కల విషయంలో తప్పనిసరిగా కొత్త నిబంధనలను అనుసరించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి